ఆమె ఛార్టెడ్ ఎక్కౌంటెన్సీ లో టాపర్..కానీ ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా.

updated: February 26, 2018 11:14 IST
ఆమె  ఛార్టెడ్ ఎక్కౌంటెన్సీ లో టాపర్..కానీ ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా.

సాధారణంగా ఓ  ఛార్టెడ్ ఎక్కౌంటెన్సీ టాపర్   భవిష్యత్ ఎలా ఊహిస్తాం..ఎక్కడో ఏ కాస్మో పాలిటన్ సిటీలోనో సొంతంగా కన్సల్టన్సీ పెట్టుకుని పెద్ద పెద్ద సంస్దల ఎక్కౌంట్స్ చూస్తూ ఎదురులేకుండా కోట్లు సంపాదిస్తూంటారని అనుకుంటాం. అయితే కొందరు మన అంచనాలు తారు మారు చేస్తారు. తమకు నచ్చిన కళలలో మమేకమైపోవటానికి తమ కెరీర్ ని పణంగా పెట్టడానికి వెనకాడరు. అలాంటి వారిలో ఒకరు విశాఖ హరి.

 ఛార్టెడ్ ఎక్కౌంట్ టాపర్ అయిన ఆమె కర్ణాటక సంగీతం వోకలిస్ట్ గానూ, హరికథా గానం చేసే ఆర్టిస్ట్ గానూ బిజీగా ఉన్నారు. అలాగే ఆమె భరత నాట్యంలో ప్రావీణ్యురాలు అంటే ఆశ్చర్యపోతారు. అయితే విశాఖ హరి అనగానే ఆమె విశాఖ పట్టణానికి చెందినది అని,తెలుగు వారిని భావించే వారు ఉన్నారు. అయితే అది నిజం కాదు. 

చెన్నైలో పుట్టి పెరిగిన ఆమె చిన్న వయస్సులోనే ఆధ్మాత్మకతను అలవరుచుకుని శ్రీరంగేశ్వరుడుని సేవలో తరించటానికి ఇష్టపడతారు. తన నాట్య ప్రదర్శనల కోసం, హరికథా గానం కోసం తరుచుగా ప్రయాణాలు చేసే ఆమె ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా ఆనాటి ఆధ్యాత్మికత, కళలకు సంభందించిన పుస్తకాలు తిరగేస్తూంటారు. 

ఇక విశాఖ హరి..కర్ణాటక సంగీతాన్ని లెజండరీ కర్ణాటక వోకలిస్ట్..పద్మ విభూషణ్ శ్రీ లాలగుడి జయరామన్ గారి వద్ద నేర్చుకున్నారు. ఆమె ఆధ్యాత్మిక గురువు ,మామగారు శ్రీ శ్రీ కృష్ణ ప్రేమ స్వామి గళ్ అవటం ఆమె జీవితంలో పెద్ద మార్పులు దారి తీసిందంటారామె. అలాగే ఆమె హరికథ గానాన్ని తన భర్త శ్రీ హరిజి  దగ్గర నేర్చుకున్నారు. ఆయన ఓ సీనియర్ హరికథా కళాకారుడు.  
 
తన కెరీర్ లో ఎన్నో అవార్డ్ లు ,రివార్డ్ లు అందుకున్న విశాఖ హరి తమిళనాట చాలా సుప్రసిద్దం.కేవలం తమిళనాట మాత్రమే కాక దేశం మొత్తం అభిమానులను కలిగి ఉన్న ఆమె చీరకట్టులో అచ్చమైన భారతీయ స్త్రీకి ప్రతీకలా ఉంటారు. ఆమెకు తెలుగు 100 శుభాకాంక్షలు తెలుపుతోంది. 

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

comments